- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్వకుంట్ల కవిత పార్టీ కోసం రంగంలోకి ప్రశాంత్ కిషోర్?
కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ కోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లు కథనాలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కవిత కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ఆమె హింట్ కూడా ఇచ్చారు. గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత.. ట్రబుల్ షూటర్ హరీష్ రావును టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే, ఇటు గులాబీ పార్టీలో ఉన్న లుకలుకలను బయట పెడుతున్నారు. అటు బీసీల నినాదం ఎత్తుకుని ముందుకు వెళుతున్నారు. ఇక ఇప్పుడు కొత్త పార్టీ వైపు కవిత అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
కవిత పార్టీ కోసం రంగంలోకి ప్రశాంత్ కిషోర్?
అయితే కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ కోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లు కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు పని చేసిన ప్రశాంత్ కిషోర్.. నెక్స్ట్ కవిత కోసం పనిచేయబోతున్నారట. రెండు నెలల వ్యవధిలోనే కల్వకుంట్ల కవితను హైదరాబాద్ కు వచ్చి పలుమార్లు రహస్యంగా సమావేశం అయ్యారట ప్రశాంత్ కిషోర్. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో వీళ్ళ సమావేశం జరిగినట్లు కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది. లేటెస్ట్ గా సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు రోజులపాటు ప్రశాంత్ కిషోర్ తో కల్వకుంట్ల కవిత సమావేశం కూడా నిర్వహించారట.
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? పార్టీ ఏర్పాటు చేశాక ఎలా ముందుకు వెళ్లాలి ? ఎలాంటి స్ట్రాటజీతో పార్టీని డెవలప్ చేయాలి అనే అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ప్రజల కోణంలో పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలను కవిత ఏర్పాటు చేశారట. ఇక ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సహాయంతో పార్టీని కూడా లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. మరి ప్రశాంత్ కిషోర్ సలహాలు కవిత పార్టీకి ఏ మేరకు కలిసి వస్తాయో చూడాలి. అటు తమిళనాడు రాష్ట్రంలో దళపతి విజయ్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ సలహాదారులుగా ఉన్నారు.
Read More..






