రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చి రూ.241 కోట్లు సంపాదించా: ప్రశాంత్ కిశోర్

by Prasad Jukanti |

రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చి కోట్లు సంపాధించానని ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చి రూ.241 కోట్లు సంపాదించా: ప్రశాంత్ కిశోర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రశాంత్ కిశోర్... ఈ దేశ రాజకీయాల పట్ల ఏ మాత్రం అవగాహన ఉన్నా ఈ పేరు తెలియని వారు ఉండరు. రాజకీయ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిశోర్ Prashant Kishor).. రాబోయే బిహార్ ఎన్నికల వేళ రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తహతహలాడుతున్నాడు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, వైసీపీ సహా దేశంలోని వివిధ పార్టీలకు రాజకీయ సలహాలు ఇచ్చిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు జన్ సురాజ్ (Jan Suraj Party) పేరుతో ఆయనే ఓ పార్టీని స్థాపించి మిగతా పార్టీలపై తన వ్యూహాలను ఎక్కు పెడుతున్నారు. ఈ క్రమంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా తన కన్సల్టేషన్ ఫీజును తాజాగా ఆయన రివీల్ చేశారు.

రెండు గంటలకు రూ. 11 కోట్లు:

బిహర్ అసెంబ్లీ ఎన్నికల వేళ జన్ సురాజ్ పార్టీ నిధులపై బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇవాళ స్పందించిన ప్రశాంత్ కిశోర్ నేను డబ్బు సంపాదించడం కోసం బిహార్‍కు రాలేదని కౌంటర్ ఇచ్చారు నేను కన్సల్టెంట్ గా పని చేశాను. రాజకీయ పార్టీలకు రెండు గంటల పాటు సలహాలు ఇచ్చినందుకు తాను రూ. 11 కోట్లు ఫీజు తీసుకున్నానని ఇది బిహార్ కుర్రాడి శక్తి అంటూ ప్రకటించారు. ఇలా నేను మూడేళ్లలో రూ. 241 కోట్లు సంపాదించానని (Prashant Kishor earns) అందులో రూ. 31 కోట్లు జీఎస్టీ, రూ. 20 కోట్లు ఇన్ కమ్ ట్యాక్స్ కట్టానని చెప్పారు. అలాగే జన్ సురాజ్ పార్టీకి చెక్ రూపంలో రూ. 98 కోట్లు విరాళంగా ఇచ్చానని సంచలన విషయాలు వెల్లడించారు. పార్టీ ఖాతాలకు అన్ని చెల్లింపులు పారదర్శకంగానే ఉన్నాయని ఎటువంటి తప్పు జరగలేదని స్పష్టం చేశారు. తనతో పాటు ఇతర వనరుల నుంచి కూడా విరాళాలు జన్ సురాజ్ కు అందాయని వెళ్లడించారు. కాగా మూడేళ్లలో రాజకీయ వ్యూహాలు చెప్పి కళ్లుచెదిరే రేంజ్ లో సంపాదించిన తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Next Story