- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Karimnagar MLC: కరీంనగర్ ఎమ్మెల్సీ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ప్రసన్న హరికృష్ణ షాక్! మూడో రౌండ్ లో బిగ్ ట్విస్ట్
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో : కరీంనగర్ గ్రాడ్యుయేట్ (Graduate MLC) ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ఫలితాల్లో బీజేపీ (BJP) ప్రతి రౌండ్‌లోనూ తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తి కాగా మూడో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి (Anji Reddy) 8,619 ఓట్లు, కాంగ్రెస్ (Congress) అభ్యర్థి నరేందర్‌రెడ్డికి (Narender Reddy) 5,614 ఓట్లు, బీఎస్పీ (BSP) అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,086, రవీందర్ సింగ్‌కు 138, మహమ్మద్ ముస్తాక్ అలీకి 239, యాదగిరి శేఖర్ రావుకు 173 ఓట్లు పోలయ్యాయి. అయితే మూడో రౌండ్ ముగిసే సరికి అంజిరెడ్డి మొత్తంగా 23,310 ఓట్లు సాధించి 4,498 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా ఇప్పటివరకు దాదాపు 63 వేల ఓట్లను లెక్కించారు. నాలుగో రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది.
కాంగ్రెస్‌కు ప్రసన్న హరికృష్ణ షాక్..
కాంగ్రెస్, బీజేపీతోపాటు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ (Prasanna Harikrishna) మధ్యే పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుందని అందరూ భావించారు. కానీ రౌండ్ రౌండ్‌కు బీజేపీ తన జోరు కొనసాగిస్తుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఓట్లను ప్రసన్న హరికృష్ణ భారీగా చీల్చారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ తమ కోర్ ఓటింగ్ పర్సంటేజ్ దక్కించుకుంటామనే ధీమాతో మొదటి నుంచి ఉండగా, బీసీ నినాదం, నిరుద్యోగ యువతను ఆకర్షించడంతో ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ ఓట్లను చీల్చారనే చర్చ మొదలైంది. అయితే స్పష్టమైన మెజారిటీ దిశగా అంజిరెడ్డి దూసుకుపోతుండగా ఒక వేళ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్లలో విజయం ఎవరిని వరించబోతున్నదనేది మరింత ఉత్కంఠ రేపుతున్నది.
మూడవ రౌండ్ లో ఫలితాలు..
అంజిరెడ్డి - 8,619( మొత్తం ఓట్లు 23,310)
నరేందర్ రెడ్డి- 5,614 (18,812)
ప్రసన్న హరికృష్ణ - 5,086 (15,880)
రవీందర్ సింగ్ - 138 (361)
మహమ్మద్ ముస్తాక్ అలీ - 239 (604)
యాదగిరి శేఖర్ రావు - 173(975)






