- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ ట్వీట్‍కు ప్రకాశ్ రాజ్ కౌంటర్.. చర్చకు సిద్ధమా అంటూ చాలెంజ్
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు నిన్న లోక్‍సభలో వీగిపోవడంపై దేశవ్యాప్తంగా రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ పరిణామంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన ట్వీట్ పై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) స్పందించారు. 'భారత చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచే చారిత్రాత్మక అవకాశాన్ని విపక్షాలు కావాలనే అడ్డుకున్నాయి. దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే, మహిళా సాధికారతకు బాటలు వేసే సంస్కరణలకు మద్దతు ఇచ్చే ఉద్దేశం విపక్షాలకు లేదు' అంటూ పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టుపై ప్రకాశ్ రాజ్ అదే ఎక్స్ వేదికగా ఇవాళ రియాక్ట్ అవుతూ.. 'దయచేసి మోదీని సంతోషపెట్టడం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించడం ఆపండి. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. దాన్ని ఇప్పటికైనా అమలు చేయవచ్చు. కానీ మీ గ్యాంగ్ దక్షిణ భారత రాష్ట్రాల, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యాన్ని బలహీనపరిచే డీలిమిటేషన్ బిల్లును తీసుకురావాలని చూస్తోంది. మిమ్మల్ని డిప్యూటీ ముఖ్యమంత్రిని చేసిన ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టవద్దు' అని పోస్టు చేశారు. ఈ విషయాన్ని వివరించడానికి నేను చర్చకు సిద్ధంగా ఉన్నానానని మరి మీరు సిద్దమా అని ప్రశ్నించారు.
దేశ రాజకీయాల్లో సంచలనం:
Please stop lying to citizens just to please Modi. Women reservation bill was approved in 2023 itself. It can be passed even now . But your gang wanted to pass Delimitation bill which would weaken the representation of South Indian states including Andhra Pradesh. Requesting you… https://t.co/LyQGy2Fh8E
— Prakash Raj (@prakashraaj) April 18, 2026






