- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air Show: సాగర తీరంలో ‘సూర్యకిరణ్’ ఎయిర్ షో అదిరిపోయాయ్! ప్రజాపాలన విజయోత్సవాలు
ప్రజాపాలన విజయోత్సవాలు ట్యాంక్‌బండ్‌పై అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాపాలన విజయోత్సవాలు ట్యాంక్‌బండ్‌పై అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని హూస్సేన్‌సాగర్ వద్ద ఎయిర్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజలు పాల్గొని ప్రదర్శనను తిలకించారు. దీంతో ట్యాంక్ పరిసరాల్లో సందడి వాతావరణం మొదలైంది. ట్యాంక్ బండ్ దగ్గర ఎయిర్ షో సుమారు 25 నిమిషాల పాటు జరిపారు. ఎయిర్ షోలో వైమానిక దళానికి చెందిన 9 సూర్యకిరణ్ విమానాలు పాల్గొన్నాయి. సాగర తీరంలో ఎయిర్‌షోలో సూర్యకిరణ్ విమానాల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎయిర్ షోను వీక్షించడానికి భారీ సంఖ్యలో నగర వాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
అదేవిధంగా సాయంత్రం ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నెక్లెస్ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ప్రముఖ సినీ తారలు సందర్శించి సందడి చేయనున్నారు. లక్కీ భాస్కర్ సినిమాతో పాటు పలు హిట్ సినిమాల్లో నటించిన మీనాక్షి చౌదరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర చిత్రాల్లో నటించిన అంజలి లతో పాటు మరికొందరు సినీ నటులు నేడు సాయంత్రం 6 గంటలకు హెచ్ఎండీఏ గ్రౌండ్ సమీపంలో ఏర్పాటు చేసిన హ్యాండ్ క్రాఫ్ట్స్, ఫుడ్ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం, ఐమాక్స్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కాన్సర్ట్ కు కూడా హాజరవుతారు. ప్రజా విజయోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా శనివారం నాడు ఏర్పాటు చేసిన వందేమాతరం శ్రీనివాస్ మ్యూజికల్ నైట్ కు నగరవాసుల నుంచి అద్భుత మైన ఆదరణ లభించింది. దీనిలో భాగంగా, నేడు ఏర్పాటు చేసిన రాహుల్ సిప్లిగంజ్ సంగీత విభావరి కి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని భావిస్తున్నారు.






