- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల వివాదం.. కేఏ పాల్ సంచలన డిమాండ్
కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీలను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు..

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి చిత్తశుద్ధి ఉంటే బీసీ(Bc)లను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Ka Paul) డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీలో 12 మంది రెడ్లు ముఖ్యమంత్రులు అయ్యారని, చేయాలనుకుంటే బీసీ నుంచి వి. హన్మంతరావు లేడా అని ఆయన ప్రశ్నించారు. దళితులను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే వి. వివేక్, మల్లు రవి లాంటి వాళ్లున్నారని కేఏ పాల్ గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లపై రాజకీయ డ్రామా జరుగుతోందని ఆరోపించారు. మొన్న సుప్రీంకోర్టులో, నేడు తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై కేసులు వేశారని మండిపడ్డారు. 28 మంది బీసీ నాయకులు పిల్ వేయడం పెద్ద డ్రామా అని కేఏపాల్ కొట్టిపారేశారు.
కాగా బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరుగుతోంది. పిటిషనర్ల తరపున వాదనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు లంచ్ బ్రేక్ తీసుకుంది. ఆ తర్వాత సైతం మరోసారి వాదనలు కొనసాగనున్నాయి. ట్రిపుల్ టెస్ట్ పాస్ కాకముందే జీవో ఇచ్చారని అడ్వకేట్ వివేక్ రెడ్డి వాదనలు వినిపించారు






