- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
K A Paul: నా కొడుకు అమెరికాకు ప్రెసిడెంట్ కావాలి.. ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ హాట్ కామెంట్స్
అమెరికాలో కొత్త పార్టీ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలో కొత్త పార్టీ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ (K. A. Paul) హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అమెరికాను కాపాడాలంటే మూడో పార్టీ కావాలని అన్నారు. (American Party) అమెరికన్ పార్టీ పై అందరి చూపులు ఉన్నాయని తెలిపారు. గతంలోనే అమెరికాలో ఉన్న అందరితో కలిసి కొత్త పార్టీ పెట్టాలని తను ప్రపోజ్ చేసినట్లు గుర్తుకు చేశారు. టెస్లా అధినే ఎలాన్ మస్క్ (Elon Musk) తో కలిసి పనిచేసే అవకాశాలున్నాయని తెలిపారు. అమెరికాలో మూడో పార్టీ అవసరం ఉందని, మూడో పార్టీ పెట్టి తీరుతామన్నారు. మస్క్ వద్ద డబ్బు ఉంది.. నాకు ఫాలోయింగ్ ఉందన్నారు. కానీ ట్రంప్ తో డీల్ కుదిరితే మస్క్ మళ్లీ వెనక్కి వెళ్తాడని వివరించారు. అమెరికాలో నా కొడుకును సిద్ధం చేస్తున్నా.. అక్కడే పుట్టి పెరిగాడు.. నా కొడుకు అమెరికాకు ప్రెసిడెంట్ కావాలని కోరిక ఉందని చెప్పుకొచ్చారు.
కేరళ నర్స్ ప్రియకు క్షమాభిక్ష పెట్టాలి
కేరళకు చెందిన నర్సు (Nimisha Priya) నిమిష ప్రియాను యెమెన్ దేశంలో ఉరికంభం ఎక్కబోతున్న విషయం తెలిసిందే. యెమెన్ దేశస్తుడైన తలాల్ అబ్దో మహదీని 2017 లో హత్య చేసిన కారణంగా ఆమెను అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధించారు. ఈ విషయంపై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏపాల్ స్పందించారు. యెమెన్ లో ఇండియన్ నర్స్ నిమిష ప్రియను రక్షించాలని అన్నారు. కేరళ నర్స్ ప్రియకు క్షమాభిక్ష పెట్టాలని యెమెన్ ప్రధానిని కోరుతూ లేఖ రాసినట్లు వెల్లడించారు. జూలై 16 న ఆమెకు మరణ శిక్ష నుంచి తప్పించాలని, ప్రియ ఎన్నో కష్టాలు పడిందని తెలిపారు. యెమెన్ దేశస్తుడైన ప్రియ పార్టనర్ ఆమెకు నరకం చూపించాడని, ఎలా తప్పించుకోవాలో అర్థం కాక, అతన్ని ప్రియ హత్య చేసిందని వెల్లడించారు. ప్రియ చేసిన హత్యను ఖండిస్తున్నా.. కానీ ప్రియకు క్షమాభిక్ష పెట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకు యెమెన్ ప్రెసిడెంట్ కి శాంతి బహుమతి ఇస్తామని, శాంతి బహుమతి కోసం నామినేట్ చేస్తామన్నారు. మహిళలకు ఈ దేశంలోనూ రక్షణ లేదని, ఇక్కడ ఉద్యోగాలు లేక.. విదేశాలకు వెళ్లి వెట్టి చాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.






