CM Revanth Reddy : జాతీయ స్థాయిలో కులగణన సర్వేకు ప్రశంసలు: సీఎం రేవంత్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-29 10:38:35  IST  )

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)నిర్వహించిన సమగ్ర ఇంటింటి సర్వే(కులగణన)కు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వెల్లడించారు.

CM Revanth Reddy : జాతీయ స్థాయిలో కులగణన సర్వేకు ప్రశంసలు: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Government)నిర్వహించిన సమగ్ర ఇంటింటి సర్వే(కులగణన)కు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వెల్లడించారు. రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కుల గణన పైన, పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై, బీసీ రిజర్వేషన్లపైన రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే పై ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. కాగా సర్వే కు సంబంధించిన ముసాయిదా సిద్దమయిందని..ఒకటి రెండు రోజుల్లో సమర్పిస్తామని అధికారులు వివరించారు.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడడంతో కుల గణన సర్వే నివేదిక కీలకమైంది. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి ఫిబ్రవరి 1 నాటికి ఏడాది పూర్తి అవుతుంది. పంచాయతీల్లో ఏడాదిగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఆలోచన చేస్తోంది. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇప్పటికే కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. కులగణన సర్వే నివేదిక కూడా అందగానే రిజర్వేషన్లపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నిర్వహణపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది..

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4గంటలకు పర్యాటక శాఖపైన, 6గంటలకు దేవాదాయ శాఖపైన సమీక్ష చేయనున్నారు.

Next Story