- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విచారణకు సహకరించని ప్రభాకర్ రావు.. సిట్ అధికారుల సంచలన నిర్ణయం
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో A1గా ఉన్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) నాలుగోసారి ఇవాళ సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో A1గా ఉన్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) నాలుగోసారి ఇవాళ సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలుమార్లు ఆయనను విచారించిన అధికారులు తాజాగా ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు (Praneeth Rao) ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుకు పలు ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలోనే ఆయన సమాధానాలు చెప్పేందుకు మొండికేసినట్లుగా తెలుస్తోంది. పదే పదే అడిగినా.. చెప్పిన సమాధానం చెబుతున్నట్లుగా సమాచారం. దీంతో తీవ్ర అసహనానికి గురైన సిట్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తునకు ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదంటూ త్వరలోని సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించనున్నారు. అదే కోర్టు ఆయనకు ఇచ్చిన రిలీఫ్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. అదేవిధంగా ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ (Custodial Interrogation) చేసేందుకు నాంపల్లి కోర్టు (Nampally)లో సిట్ అధికారులు పిటిషన్ వేసే అవకాశం ఉంది.






