Prabhakar Rao: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. సిట్‌ విచారణకు ప్రభాకర్‌రావు హాజరు

by Prasad Jukanti |

ప్రభాకర్ రావు నోరు తెరిస్తే బీఆర్ఎస్ పెద్దలకు చిక్కులు తప్పవా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో గుప్పుమంటోంది.

Prabhakar Rao: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. సిట్‌ విచారణకు ప్రభాకర్‌రావు హాజరు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone tapping case) కీలక నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ (SIT) విచారణకు హాజరయ్యారు. పంజాగుట్ట పీఎస్ లో నమోదైన కేసు విచారణలో భాగంగా ఆయన ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఏ1 గా ఉన్న ప్రభాకర్ రావు (Prabhakar Rao) 14 నెలల తర్వాత సుప్రంకోర్టు ఆదేశాలతో అమెరికా నుంచి నిన్న హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇవాళ ఉదయం సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నలుగురు అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు అరెస్టయి దీర్ఘకాలం రిమాండ్ లో ఉన్నారు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. గతంలో విచారణ సమయంలో వీరిచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ కు బిగ్ ట్విస్ట్ తప్పదా?

గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున రాజకీయ, సినీ, ప్రముఖులు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిలో ప్రభాకర్ రావు కీలకంగా ఉన్నారనే ప్రచారం ఉంది. గత ప్రభుత్వ పెద్దలే ఫోన్ ట్యాపింగ్ ల విషయంలో అధికారులను ప్రోత్సహించారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ రావు నోరు తెలిస్తే ఈ కేసులో ఎలాంటి ట్విస్ట్ లు రాబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది. ఇదే జరిగితే ఈ పరిణామం బీఆర్ఎస్ లో ఎవరికి ఎర్త్ పెట్టబోతున్నది అనేది ఉత్కంఠ రేపుతున్నది. ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కీలక దశలో ఉన్న సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మళ్లీ పట్టాలెక్కడం బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Next Story