Prabhakar Rao: నాంపల్లి కోర్టుకు వచ్చిన ప్రభాకర్‌రావు.. జడ్జి లేకపోవడంతో..

by Prasad Jukanti |

ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంలో నాంపల్లి కోర్టుకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హజరయ్యారు.

Prabhakar Rao: నాంపల్లి కోర్టుకు వచ్చిన ప్రభాకర్‌రావు.. జడ్జి లేకపోవడంతో..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) మంగళవారం నాంపల్లి కోర్టుకు (Nampally Court) హాజరయ్యారు. గతంలో ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రభాకర్ రావును ప్రకటించేందుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంలో ఈ నెల 20 లోపు న్యాయస్థానం ఎదుట హాజరుకాకపోతే ప్రకటిత నేరస్థుడిగా న్యాయస్థనం ఖరారు చేయనున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసుల నేపథ్యంలో కోర్టులో హాజరయ్యేందుకు ప్రభాకర్ రావు రాగా జడ్జి అందుబాటులో లేరు. దీంతో ఆయన అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అమెరికా పారిపోయిన నేపథ్యంలో ఈ నోటీసులను నాంపల్లి కోర్టు ఇచ్చింది. అయితే మొన్నే రాష్ట్రానికి వచ్చిన ప్రభాకర్ రావు నిన్న సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చినా జడ్జి అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Next Story