- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సొంతడప్పు కొట్టుకోవడానికే పీపీటీ.. బీఆర్ఎస్‌పై విప్ ఆది శ్రీనివాస్ సెటైర్లు
అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కృష్ణా జలాల రగడ రాజుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ వేదికగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కృష్ణా జలాల రగడ రాజుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ వేదికగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ హాలులో పలు చోట్ల ప్రత్యేక స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రభుత్వానికి కౌంటర్‌గా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పీపీటీకి సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) బీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని సాక్షాత్తూ కేసీఆర్ (KCR) కూతురు కవిత (Kavitha) చెబుతోందని అన్నారు. తెలంగాణ భవన్‌లో పీపీటీ అనేది సొంత డప్పు కొట్టుకోవడానికే పెడుతున్నారా అని సెటైర్లు వేశారు. నిజంగా నిజాయితీ ఉంటే అసెంబ్లీకి వచ్చి కృష్ణా జలాల అంశాన్ని చర్చించాలన్నారు. అధికారంలో ఉంటేనే బీఆర్ఎస్ నాయకులు శాసనసభకు వస్తారా..? అని ప్రశ్నించారు. కృష్ణా జలాలపై ఎవరేం చేశారో సభలో మాట్లాడుదామని సీఎం చెప్పారని.. కానీ హరీశ్ రావుకు మైక్ ఇస్తే సబ్జెక్ట్ మాట్లాడకుండా రాజకీయం చేశారని ఫైర్ అయ్యారు.






