Bhatti Vikramarka: త్వరలోనే ఆ తేదీని ప్రకటిస్తాం.. కులగణన సర్వేపై భట్టి కీలక ప్రకటన

by Prasad Jukanti |

కులగణన సర్వేపై భట్టి కీలక ప్రకటన చేశారు.

Bhatti Vikramarka:  త్వరలోనే ఆ తేదీని ప్రకటిస్తాం.. కులగణన సర్వేపై భట్టి కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: కులగణన సర్వే (Caste Census Survey) పూర్తిగా పారదర్శకంగా ఎక్కడా పొరపాటు లేకుండా నిర్వహించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఈ సర్వే ప్రక్రియపై పూర్తి స్థాయిలో అతి త్వరలోనే మీడియా సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని వెల్లడించారు. ఆ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. బుధవారం సెక్రటేరియట్ (Secretariat) లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్న అసెంబ్లీ ఆమోదించిన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చాలా కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న సమస్యలు అన్నారు. వీటికి మా ప్రభుత్వం పరిష్కార మార్గం చూపించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సర్వే జరగకుండా కొంత మంది కుట్రలు చేశారని, సర్వేలో పాల్గొనవద్దని ప్రచారం చేశారని ఆరోపించారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని చెప్పారు. సర్వేకు సహకరించిన అందరికి ధన్యావాదాలు తెలిపారు. కులగణన సర్వే చారిత్రాత్మకమైనదని, సమర్థవంతంగా చేసిన కులగణన సర్వేపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రాన్ని 94 బ్లాకులుగా విభజించి కులగణన చేశామని లక్షకు పైగా ఎన్యుమరేటర్లు ఈ సర్వేలో పాల్గొన్నారని చెప్పారు.

Next Story