- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బనకచర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్.. హాజరైన సీఎం రేవంత్ సహ అన్ని పార్టీల ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు(Godavari-Banakacherla Link Project)పై తెలంగాణ రాష్ట్ర సర్కారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు చర్యలు చేపడుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు(Godavari-Banakacherla Link Project)పై తెలంగాణ రాష్ట్ర సర్కారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు చర్యలు చేపడుతోంది. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttham Kumar Reddy) ఈ ప్రాజెక్టుపై ఒక పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణలోని అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించారు. కాగా కొద్దిసేపటి క్రితం మొదలైన ఈ పవర్‌పాయింట్ ప్రజంటేషన్లో బీజేపీ తరపున డీకే అరుణ, రఘునందన్ రావు, బీఆర్ఎస్ తరపున వద్దిరాజు రవిచంద్ర, ఎంఐఎం తరపున అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు.
అలాగే కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరి, రఘురామ్ రెడ్డి, రఘువీర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, సురేష్ షెట్కార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీల నుండి సలహాలు, సూచనలు సేకరించి ప్రాజెక్టును అడ్డుకోవడానికి తదుపరి చర్యలపై ప్రణాళిక రచించనుంది ప్రభుత్వం. కేంద్రం ఈ ప్రాజెక్టుకు అనుమతిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా సర్కార్ పరిశీలిస్తోంది.






