- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mahesh Kumar Gou: కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా మరో 15 ఏళ్లు అధికారం మాదే: టీపీసీసీ చీఫ్
బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) ఎన్ని జిమ్మిక్కులు, పల్టీలు కొట్టినా వారిని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. రాబోయే 15 ఏళ్లు ఈ రాష్ట్రంలో ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయిన సందర్భంగా ఓ మీడియా చానల్‌తో మాట్లాడిన ఆయన.. గడిచిన పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని, ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిన పనులను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని చెప్పారు. తమ పని తీరును ప్రజలు గమనిస్తున్నారని, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో చేసిన విధ్వంసాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని, వాటికి మేం మరమ్మతులు చేస్తూ వస్తున్నామన్నారు. కులగణన సర్వే ఆధారంగానే సర్పంచ్ ఎన్నికలకు పోవాలని ఆశిస్తున్నామన్నారు. ఈ ఏడాది కాలంలో గొప్ప పాలన అందించామని, అయితే చేసిన పనులను ప్రచారం చేసుకోవడంలో కాస్త వెనుకబడి పోయామన్నారు. సంక్రాంతి నుంచి ప్రచారం ఉధృతం చేస్తామన్నారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో సామాజిక న్యాయం పాటించామన్నారు.
వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలపై వివరణ కోరిన టీపీసీసీ
ఓ సామాజిక వర్గంపై షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapalli Shankar) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మహేశ్‌కుమార్ గౌడ్ ఖండిచారు. ఈ వ్యాఖ్యలపై తాను సీఎం కలిసి మాట్లాడుకుని ఎమ్మెల్యేను వివరణ కోరామన్నారు. ఎదుటి వర్గాన్ని, మతాన్ని కించపరిచే మాటలను మా పార్టీ సమర్థించదని స్పష్టం చేశారు.






