- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Power Demand: భారీగా తగ్గిన విద్యుత్ డిమాండ్.. 10,500 మెగావాట్లకు చేరిక
రాష్ట్రంలో ఊహించని విధంగా విద్యుత్‌డిమాండ్ భారీగా తగ్గింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఊహించని విధంగా విద్యుత్‌డిమాండ్ భారీగా తగ్గింది. నిన్న మొన్నటి వరకు ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజానీకానికి ఇటీవల కురిసిన వర్షాలతో కాస్త ఉప శమనం లభించింది. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల జోలికి వెళ్లకుండా వాటి వినియోగాన్ని తగ్గించుకున్నారు. అటు యాసంగి సీజన్ముగియడంతో రైతుల పంట అవసరాలకు విద్యుత్పెద్దగా అవసరం లేకుండా పోయింది. ఈ క్రమంలో మార్చి 20 నుంచి 17,162 మెగావాట్లుగా ఉన్న విద్యుత్డిమాండ్ఒక్క సారిగా తగ్గి 10,500 మెగావాట్లకు తగ్గింది. నాలుగు రోజులుగా కేవలం 10,539 మోగావాట్లుగానే నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఒకింత విద్యుత్డిమాండ్ఎక్కువగా ఉంటోంది. మార్చి 20న జీహెచ్‌ఎంసీ పరిధిలో 3,300 మెగావాట్ల విద్యుత్డిమాండ్నమోదు కాగా, తాజాగా 3,900గా నమోదు అయ్యింది. ప్రజలకు నాణ్యమైన విద్యుత్అందించేలా ఇటు విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క, అటు ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్అంతరాయాలను నివారించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ఫరూఖీ.. జీహెచ్ఎంసీ పరిధిలోని పాత బస్తీ, సికింద్రాబాద్తదితర ప్రాంతాల్లో వారం రోజులుగా సమావేశాలు నిర్వహిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. అన్ని సర్కిళ్లలోనూ ఫీడర్ల సప్లయ్‌లో ఇబ్బందులు కల్గకుండా సూచనలు చేస్తున్నారు.






