- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో పవర్ కట్! ప్రభుత్వంపై సెటైర్లు!
by Ramesh Naini |
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంట్ సరిగా ఉండటం లేదని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంట్ సరిగా ఉండటం లేదని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కేసీఆర్ సూర్యాపేట జిల్లాలో ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.
కేసీఆర్ మాట్లాడుతుండగా పవర్ కట్ అయ్యింది. కొద్ది సేపటి తర్వాత పవర్ వచ్చింది. వెంటనే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇట్ల కరెంటు పోతా.. వస్త ఉంటది అంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ అన్న మాట వినగానే సభలో అందరూ నవ్వారు. కరెంటు కోతలను ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నామని మాజీ కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు.
Next Story






