Power Cut: సంగారెడ్డిలో టెన్షన్ టెన్షన్..! కౌంటింగ్ కేంద్రంలో పవర్ కట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-13 03:08:40  IST  )

సంగారెడ్డి తారా కాలేజీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో ఫలితాలు వెలువడుతున్న కీలక సమయంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రూమ్ నెంబర్ 6లో చీకటి అలుముకోవడంతో లెక్కింపు ప్రక్రియకు ఆటంకం ఏర్పడి, అభ్యర్థులు మరియు ఏజెంట్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Power Cut: సంగారెడ్డిలో టెన్షన్ టెన్షన్..! కౌంటింగ్ కేంద్రంలో పవర్ కట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల నగారా మోగింది. ఉదయం నుంచే కౌంటింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు, వారి ఏజెంట్లు, మద్దతుదారుల కోలాహలం నెలకొంది. అయితే, సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో ఒక ఆసక్తికరమైన, చిత్రవిచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని తారా కాలేజీ (Tara College)లో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోని రూమ్ నంబర్ 6లో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై, ఫలితాలు వెలువడుతున్న కీలక సమయంలో పవర్ కట్ కావడంతో ఒక్కసారిగా అక్కడ ఉత్కంఠ నెలకొంది. చీకటి అలుముకోవడంతో ఇంకా అక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాలేదు.

Next Story