- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త సీఎండీ జితిన్ వి పాటిల్‌ను కలిసిన విద్యుత్ కాంట్రాక్టర్లు.. త్వరలో పూర్తిస్థాయిలో సమావేశం
టీజీఎస్సీడీసీఎల్ సీఎండీగా కొత్తగా నియమితులైన జితిన్ వి పాటిల్ ను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీఎస్సీడీసీఎల్ సీఎండీగా కొత్తగా నియమితులైన జితిన్ వి పాటిల్‌ను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కే. మాజిద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టర్లు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. యాజమాన్యం క్షేత్రస్థాయిలో తమకు అండగా ఉంటే పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని సీఎండీ దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. అందుకు సానుకూలంగా స్పందించిన సీఎండీ త్వరలోనే పూర్తిస్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షిస్తామని భరోసా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. సీఎండీని కలిసిన వారిలో ఏ గ్రేడ్ మాజీ సభ్యులు పి.సదానందం, ఆర్గనైజింగ్ కార్యదర్శి పర్వతాలు, అసిఫ్ ఇషాక్, నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు సత్తురి శ్రీనివాస్ గౌడ్, దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు కనకాచారి, తరుణ్ తదితరులు ఉన్నారు.






