TGSPDCL: సమ్మర్‌లో చిన్న సమస్య కూడా రావొద్దు.. విద్యుత్ డిమాండ్ ఏ స్థాయిలో పెరిగినా సరఫరా జరగాలి

by Gantepaka Srikanth |

విద్యుత్ డిమాండ్(Electricity Demand) ఏ ఏడాదికి ఆ ఏడాది పెరుగుతున్నదని, దానికి తగ్గట్టు ట్రాన్స్ కో & డిస్కం అధికారులు సమన్వయం చేసుకుంటూ అదనపు చర్యలు చేపట్టాలని, రానున్న ఎండా కాలం

TGSPDCL: సమ్మర్‌లో చిన్న సమస్య కూడా రావొద్దు.. విద్యుత్ డిమాండ్ ఏ స్థాయిలో పెరిగినా సరఫరా జరగాలి
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ డిమాండ్(Electricity Demand) ఏ ఏడాదికి ఆ ఏడాది పెరుగుతున్నదని, దానికి తగ్గట్టు ట్రాన్స్ కో & డిస్కం అధికారులు సమన్వయం చేసుకుంటూ అదనపు చర్యలు చేపట్టాలని, రానున్న ఎండా కాలంలో డిమాండ్ ఏ స్థాయిలో పెరిగినా విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని అక్టోబర్ చివరి నాటికి సమ్మర్ ఆక్షన్ ప్లాన్ పనులు ప్రారంభించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ(Musharraf Farooqui) ఆదేశించారు.

శుక్రవారం, మింట్ కాంపౌండ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్‌కో మరియు దక్షిణ పంపిణీ సంస్థ డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీర్ల మరియు సుపరింటెండింగ్ ఇంజినీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాదిలో గరిష్ట డిమాండ్ 19500 మెగావాట్ల నుండి 20000 మెగావాట్లకు, గ్రేటర్ హైదరాబాద్‌లో సైతం డిమాండ్ 5000 మెగా వాట్లకు చేరే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ డిమాండ్‌ను తట్టుకోవడానికి గాను, దక్షిణ డిస్కం పరిధిలో 3866 అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ లు, 431 పవర్ ట్రాన్స్ ఫార్మర్ల స్థాయి పెంచడం, అదనంగా ఏర్పాటు చేయాలని ప్రాధమికంగా నిర్ణయించినట్టు తెలిపారు. పెరుగుతన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్ కో కు సంబంధించిన జూబ్లీహిల్స్, మాదాపూర్, మణి కొండ, గచ్చి బౌలి, మేడ్చల్, శివరాం పల్లి, MD పల్లి, పఠాన్ చేరు, RC పురం, బొల్లారం, బోరపట్ల, నర్సాపూర్, పలమాకుల సబ్ స్టేషన్ల లో గల పవర్ ట్రాన్స్ ఫార్మర్ కెపాసిటీ పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.

సీఎండీ ముషారఫ్ ఫరూఖీ మాట్లాడుతూ, స్థలాల కొరతను అధిగమించడం కోసం ప్రస్తుతం అందుబాటులో వున్న స్థలాలను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు సాంకేతికంగా చర్యలు తీసుకున్నామన్నారు. దానిలో భాగంగా సంస్థ పరిధిలో మొట్టమొదటి సారిగా 1000 kva డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ నగరం లో 70 శాతానికి మించి లోడ్ ఎదుర్కొనే 500 కెవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ ల స్థానంలో 1000 KVA కెపాసిటీ గల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే విధంగా 33/ 11 కేవీ సబ్ స్టేషన్ల పరిధిలో ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో గల సబ్ స్టేషన్లలో గరిష్ట కెపాసిటీ కలిగిన 16 MVA PTR (పవర్ ట్రాన్స్ ఫార్మర్) లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పెద్ద కెపాసిటీ కలిగిన ట్రాన్స్ ఫార్మర్ ల ఏర్పాటు వలన స్థలాల కొరత చాలా వరకు తగ్గిద్దని సీఎండీ అన్నారు.

డిమాండ్ పెరగనున్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్ర స్థాయి అధికారులతో సమావేశమై, క్షుణ్ణంగా పరిశీలించి ఒక వారం రోజుల్లో ప్రణాళికలు రూపొందించాలని, దానికి తగ్గట్టు ఈ నెల చివరి వరకు రిపేర్ & మెయింటనెన్స్ పనులకు సంబంధిచిన పనులు మొదలు పెట్టాలని సీఎండీ సూచించారు. ఈ పనులన్ని డిసెంబర్ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ట్రాన్స్ కో డైరెక్టర్ లు సంపత్ కుమార్, లతా వినోద్, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ డైరెక్టర్లు డా. నరసింహులు, శివాజీ, ట్రాన్స్ కో చీఫ్ ఇంజినీర్లు చిరంజీవి, వాసుదేవ రావు, డిస్కం చీఫ్ ఇంజినీర్లు పాండ్య, నరసింహ స్వామి, బాల స్వామి, ఆనంద్, కామేష్, ప్రభాకర్ ఇతర సూపెరింటెండింగ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

Next Story