- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS MLA లాస్య డెడ్ బాడీకి పోస్ట్ మార్టమ్ పూర్తి.. అంత్యక్రియలు ఎక్కడంటే..?
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (33) కారు ప్రమాదంలో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (33) కారు ప్రమాదంలో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె డెడ్ బాడీకి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కాసేపటి క్రితం పోస్ట్ మార్టమ్ పూర్తి అయింది. మారేడుపల్లిలో తండ్రి సాయన్న సమాధి పక్కనే లాస్య అంత్యక్రియలు చేయనున్నారు. లాస్య నందిత పోస్ట్ మార్టమ్ సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాంధీ ఆసుపత్రి వద్దనే ఉన్నారు. ఇక, లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాద ఘటనపై భిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే కారణమని పోలీసులు అంచనాకు వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతితో ఆమె కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.
Next Story






