343 మంది మిడ్ వైఫరీల కు పోస్టింగ్స్!

by Geesa Chandu |

రాష్ట్రవ్యాప్తంగా 343 మంది మిడ్‌ వైఫరీలకు వైద్యారోగ్య శాఖ పోస్టింగ్స్‌ ఇచ్చింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

343 మంది మిడ్ వైఫరీల కు పోస్టింగ్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా 343 మంది మిడ్‌ వైఫరీలకు వైద్యారోగ్య శాఖ పోస్టింగ్స్‌ ఇచ్చింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసవాలు అధికంగా నమోదయ్యే దవాఖానల్లో, వైద్యులు అందుబాటులో లేని ప్రాంతాల్లో నర్సులు పురుడు పోసేలా, ప్రసవ సేవలు అందించేలా గత ప్రభుత్వం ‘నర్స్‌ ప్రాక్టీషనర్స్‌ ఇన్‌ మిడ్‌వైఫరీ’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన నర్సులకు శిక్షణ ఇచ్చింది. మొత్తం 354 మందికి శిక్షణ ఇవ్వగా, ఇందులో 7 మంది ఇప్పటికే గురుకులాల్లో నియమితులు కాగా, ఒక ఎన్‌పీఎం మరణించారు. మరో ముగ్గురు ఎంఈలుగా శిక్షణ పొందుతున్నారు. మిగతా 343 మందిని జిల్లాలకు కేటాయించింది. సీహెచ్‌సీ, ఏరియా హాస్పిటళ్లు, జిల్లా దవాఖానలు, ఎంసీహెచ్‌లు, జీజీహెచ్‌లలో వీరి సేవలను వినియోగించుకోనున్నారు.

Next Story