మళ్లీ విద్యుత్ ఛార్జీలు పెంచే అవకాశం!

by Yella Dhawani Reddy |

తెలంగాణ విద్యుత్​ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో టీజీఎస్‌పిడిసిఎల్​పరిధిలోని వారికి మార్చి నెల 18న సిరిసిల్లలోని పద్మనాభ కళ్యాణమండపంలో పబ్లిక్​హియరింగ్‌ను నిర్వహించనుంది.

మళ్లీ విద్యుత్ ఛార్జీలు పెంచే అవకాశం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విద్యుత్​ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో టీజీఎస్‌పిడిసిఎల్​పరిధిలోని వారికి మార్చి నెల 18న సిరిసిల్లలోని పద్మనాభ కళ్యాణమండపంలో పబ్లిక్​హియరింగ్‌ను నిర్వహించనుంది. అదే విధంగా 19వ తేదీన టీజీఎన్‌పిడిసిఎల్​పరిధిలోని వారికి వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో నిర్వహించనుంది. ఈ చోట్ల ఇటు విద్యుత్​ అధికారులు, అటు వినియోగదారులు నేరుగా తమ తమ వాదనలను వినిపించుకునే అవకాశం కల్పించింది. పబ్బిక్​హియరింగ్‌కు రాలేని వారు ఆన్​లైన్‌లోనూ తమ వాదనలు వినిపించుకోవచ్చని తెలంగాణ విద్యుత్​ నియంత్రణ మండలి వెల్లడించింది.

కాగా, రాతపూర్వకంగా ఇవ్వాలనుకుంటే మార్చి నెల 3వ తేదీని తుది గడువుగా విధిస్తూ తెలంగాణ విద్యుత్​ నియంత్రణ మండలి తన ప్రకటనలో తెలియజేసింది. కాగా మళ్లీ విద్యుత్​ఛార్జీలు పెంచే అవకాశాలు లేకపోలేదని వినియోగదారులు అంటుండగా, ఈసారి కూడా ప్రభుత్వం వినియోగదారులపై విద్యుత్​ఛార్జీల భారం పడకుండా చూడనుందని చెబుతున్నారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ నిర్వహించనున్న ఈ సమావేశంలో విద్యుత్​పంపిణీ నష్టాలను 4.75 శాతానికి తగ్గించడం ద్వారా తాము ఒక మైలురాయిని సాధించామని అధికారులు పేర్కొంటున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఆదాయం ఉంటుందని, ఈ క్రమంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించే వినియోగదారులకు స్వల్ప పెంపును అనుమతించాలని ఈఆర్‌సికి విన్నవిస్తామని అధికార వర్గాలు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.

Next Story