- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘గబ్బర్ సింగ్’ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత
by Ramesh Naini |
ప్రముఖ సినీ, జానపద నేపథ్య గాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సినీ, జానపద నేపథ్య గాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. సికింద్రాబాద్ పద్మారావు నగరంలోని తన నివాసంలో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా వడ్డేపల్లి శ్రీనివాస్ అనారోగ్యంతో బాధ పడుతున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. నేడు తుడిశ్వాస విడిచారని పేర్కొన్నారు. ఆయన మరణంతో పలువురు సినీ, జానపద కళాకారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, 2012లో గబ్బర్‌సింగ్ సినిమాలో ‘గన్నులాంటి పిల్ల’ అనే పాటతో ఆయన పాపులర్ అయ్యారు. ఆ పాటకిగానూ ఆయన ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా వచ్చింది. దాదాపు 100కి పైగా సాంగ్స్, ప్రైవేట్‌గా ఎన్నో జానపద పాటలు పాడారు. తన తెలంగాణ జానపద పాటలకు ఎంతో ప్రజాదరణ లభించింది.
Next Story






