- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rahul: నా వల్లే ప్రాబ్లమ్ అయితే వెళ్ళిపోతా..! ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసిన రాహుల్ రామకృష్ణ..!
అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు సినిమాలతో ఫేమస్ అయన నటుడు రాహుల్ రామకృష్ణ తన ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు సినిమాలతో ఫేమస్ అయన నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) తన ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ (Twitter account) డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉండే ఆయన దసరా పండగ పూట వరుసగా ట్వీట్లతో రచ్చ చేశారు. నిన్న ఎక్స్ వేదికగా హల్ చల్ చేసిన రాహుల్.. తాజాగా ఆయన ఎక్స్ ఖాతా కనిపించకుండా పోయింది. తాజాగా ఆయన అకౌంట్ ఓపెన్ కాకపోవడంతో ఏమై ఉంటుందా..? అని సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన వేసిన ట్వీట్‌లు వివాదాస్పదంగా మారండంతో పూర్తిగా డిలీట్ చేశారా..? డీయాక్టివేట్ చేశారా..? ఎవరైనా రిపోర్ట్‌లు కొట్టారా? అని తెలియాల్సి ఉంది. ‘నా వల్లనే ప్రాబ్లమ్ అయితే వెళ్ళిపోతా ఇక్కడి నుంచి’ అన్నట్లుగా జాతి రత్నాలు సినిమాలో ఫేమస్ డైలాగ్ మాదిరి వరసగా వేసిన ట్వీట్‌లతో ప్రాబ్లమ్ అవ్వడంతో ఖాతా డీయాక్టివేట్ చేసుకోని వెళ్లిపోయినట్లు ఎక్స్ వేదికగా హాట్‌టాపిక్‌గా మారింది.
‘హైదరాబాద్ మళ్లీ మునిగింది. హామీలన్నీ విఫలమయ్యాయి. పరిస్థితులు అన్ని చక్కబెట్టేందుకు కేసీఆర్ మళ్లీ రావాలని (KCR comeback) జనం కోరుకుంటున్నారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ‘గాంధీ సాధువు కాదు.. అతను మహాత్ముడే కాదంటూ’ (Gandhi not a saint) మరో ట్వీట్ చేశారు. మరో ట్వీట్‍లో మనము ఎంత భయంకరమైన కాలంలో జీవిస్తున్నామో! డంబుల్‌డోర్ తిరిగి వచ్చే రోజుకి ఎదురుచూడలేకపోతున్నాను. అంటూ కేటీఆర్ ను ట్యాగ్ చేశారు. వెళ్ళి నన్ను చంపేయండి. ఇప్పటికే విసిగిపోయాను, బోలెడంత అలసిపోయాను’ అని ట్వీట్‌లో రాసుకొచ్చాడు. రాహుల్ రామకృష్ణ ట్వీట్లకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ట్వీట్లను బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేయగా కాంగ్రెస్ మద్దతుదారులు కౌంటర్లు ఇచ్చారు. ఈ క్రమంలో దసరా పూట మందు ఎక్కువైందా? ప్రభుత్వం నీకేం తక్కువ చేసింది అంటూ నెటిజన్‌లు కామెంట్ పెట్టారు.
రాహుల్ ట్విట్టర్ ఖాతా డీ యాక్టివేట్ చేసుకోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ‘కాంగ్రెస్ పార్టీ రాహుల్ రామకృష్ణ మీద అసత్యాలు ప్రచారం చేయడం మొదలు పెట్టారు.. వ్యక్తిగత హననం మొదలు పెట్టారు.. అతన్ని బెదిరించి ట్విట్టర్ ను deactivate చేసుకునేలా చేశారు. సమాజంలో గుర్తింపు ఉన్న సెలబ్రిటీ తన భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ లేదంటే మనం ఎలాంటి పాలనలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు’ అని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బెదిరింపుల వల్లే ఆయన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశారని నెట్టింట ఆరోపణలు వచ్చాయి.






