- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వేచ్ఛ చనిపోవాలని పూర్ణ అనుకోలేదు - అడ్వకేట్
స్వేచ్ఛ ఆత్మహత్య సంఘటన పై పూర్ణచందర్ అడ్వకేట్ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్ణచందర్ రిమాండ్ ప్రాసెస్

దిశ, వెబ్ డెస్క్ : స్వేచ్ఛ ఆత్మహత్య సంఘటన పై పూర్ణచందర్ అడ్వకేట్ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్ణచందర్ రిమాండ్ ప్రాసెస్ కొనసాగుతోందన్నారు పూర్ణచందర్ అడ్వకేట్. లేఖలో రాసింది వంద శాతం నిజమని పూర్ణ అంటున్నాడని వెల్లడించారు. తన వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెబుతున్నాడని పేర్కొన్నారు. స్వేచ్ఛ చనిపోవాలని పూర్ణ ఎన్నడూ అనుకోలేదని స్పష్టం చేశారు. స్వేచ్ఛ కుమార్తెను తన సొంత బిడ్డగా చూసుకున్నాడని చెప్పారు. పూర్ణచందర్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్నామని పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా పూర్ణచందర్ పై పోక్సో కేసు నమోదు అయింది. నమ్మించి మోసం చేయడం, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో 69 బి.ఎన్.ఎస్, అలాగే 108 బి.ఎన్.ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. టీవీ యాంకర్ స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్ ఆధారంగా పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో కూడా తనతో పూర్ణచంద్ర అసభ్యంగా ప్రవర్తించినట్లు స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పూర్ణచందర్ పై పోక్సో కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా రెండు రోజుల కిందట టీవీ యాంకర్ స్వేచ్ఛ మృతి చెందిన సంగతి తెలిసిందే.






