- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T Congress: జూబ్లీహిల్స్ లో పొన్నం చిచ్చు!.. సీఎం హెచ్చరించినా పాటించకపోవడంతో వివాదం?
తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్ రేస్ రోజు రోజుకు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో జూబ్లీహిల్స్ బైపోల్ రేస్ రోజు రోజుకు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నది. హైదరాబాద్ లోనే రిచెస్ట్ నియోజక వర్గంగా పేరున్న ఈ స్థానంలో తమ సత్తా ఏంటో చాటేందుకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికను తమ ఖాతాలో వేసుకోవడం ద్వారా తమ పాలనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో ఈ ఉపఎన్నిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ బై పోల్ (Jubilee Hills by poll) అభ్యర్థి విషయంలో తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో చిచ్చు రాజేశాయి. హైదరాబాద్ ఇన్ చార్జి మంత్రిగా ఉన్న పొన్నం నిన్న మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ బై పోల్ లో కాంగ్రెస్ టికెట్ బయటి వాళ్లకు ఇవ్వబోమన్నారు. 'అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది. కానీ అభ్యర్థి మాత్రం స్థానిక జూబ్లీహిల్స్ కు చెందిన వ్యక్తి మాత్రమే ఉంటారు' అని స్పష్టం చేశారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హైదరాబాద్ కాంగ్రెస్ లో రచ్చగా మారాయి.
పొన్నం ఏమైనా హైకమాండా?:
పొన్నం చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ (Feroz Khan) కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ స్థానికులకే టికెట్ ఇస్తామని చెప్పడానికి పొన్నం ఏమైనా హైకమాండా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్‌లో పుట్టి పెరిగారా? మరి వాళ్లెందుకు వయనాడ్‌లో పోటీ చేశారు? అని నిలదీశారు. ఇది కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థి ఎంపిక కు ప్రాసెస్ ఉంటుంది అని హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి చనిపోవడంతో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీకి సింపతీ ఉంది. స్థానికులకే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనడం మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. అయితే అజారుద్దీన్ ను తన పక్కన పెట్టుకుని పొన్నం ఈ వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నవారిని ఆగ్రహానికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ మాటలు పెడచెవిన!:
జూబ్లీహిల్స్ అభ్యర్థి విషయంలో రాబోయే పరిణామాలను పసిగట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గతంలోనే పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడకూడదని హెచ్చరించారు. గత నెలలో జరిగిన కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేసిన రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పార్టీని సిద్ధం చేయాలని సూచించారు. అభ్యర్థి విషయంలో ఎవరూ మాట్లాడకూడదని ఆదేశించారు. అయితే జూబ్లీహిల్స్ టికెట్ నాదే అని అజారుద్దీన్ గతంలో ప్రకటన చేయడంతో సీఎం ఈ హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఇంతలా హెచ్చరించినా మంత్రి పొన్నం మాత్రం అదే అజారుద్దీన్ ను పక్కన పెట్టుకుని స్థానికులకే టికెట్ అంటూ స్టేట్ మెంట్ ఇవ్వడం హైదరాబాద్ కాంగ్రెస్ లో తాజా వివాదానికి దారి తీసింది. ఇక్కడ ముస్లిం మైనార్టీ ఓటర్లు డెసిషన్ మేకర్ పొజిషన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మైనార్టీ ఓటర్లే టార్గెట్ బీఆర్ఎస్ పావులు కదుపుతుంటే, ఈక్కడ జెండా పాతేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. ఇటువంటి తరుణంలో పొన్నం చేసిన వ్యాఖ్యలతో మరో కాంగ్రెస్ లోని మరో మైనార్టీ నేత ఫిరోజ్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేయడం అధికార పార్టీలో కాకరేపుతోంది. అంతిమంగా టికెట్ ఎవరికి దక్కినా కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి.






