- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponnam Prabhakar: ఇన్నాళ్లు పేదల రక్తం తాగి ఇప్పుడు బిల్డపా?.. జీఎస్టీ మార్పులపై మంత్రి పొన్నం ఫైర్
జీఎస్టీ విషయంలో మోడీ ప్రకటన దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు

దిశ, డైనమిక్ బ్యూరో: జీఎస్టీ (GST) విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రకటన దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ధ్వజమెత్తారు. దేశ ప్రజలను దోచుకునేందుకే నాడు జీఎస్టీని ఆయుధంగా వాడారని, వాళ్లే పన్నులు వేసి, వాళ్లే తగ్గించి, ఇప్పుడు వాళ్లే సంబరాలు చేసుకుంటున్నారని దీన్ని మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదని దుయ్యబట్టారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన ఆయన.. 8 ఏళ్లుగా జీఎస్టీ పేరుతో పేద ప్రజల రక్తం తాగి ఇప్పుడు పేదలకు లబ్ధి చేసినట్టు బీజేపీ నాయకులు బిల్డప్ ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. జీఎస్టీ తగ్గింపు అంత ఎన్నికల డ్రామా అని, ఇంకా జీఎస్టీ ఫలాలు పేదోడికి అందలేదన్నారు.
నాడు రాహుల్ గాంధీ చెప్పినా వినలే:
జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎప్పుడో చెప్పారని, ఇది సహేతుకంగా లేదని శ్లాబులు కాదు రేట్లు తగ్గించాలని ఆయన డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వ మాత్రం పెడచెవిన పెట్టిందని పొన్నం విమర్శించారు. జీఎస్టీ శ్లాబుల పేరుతో ప్రతి వస్తువు మీద అదనపు పన్నులు వేసి పేదలు మోయలేని భారాన్ని మోపారన్నారు. జీఎస్టీ వచ్చి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల తర్వాత ప్రజలకు ఇన్ని వేల కోట్లు ఆదా అవుతున్నాయని చెబుతున్నారంటే ఈ 8 సంవత్సరాలు మీరు ప్రజల రక్తం పీల్చుకు తిన్నట్టే కదా అని నిలదీశారు. ఇన్నాళ్లు జీఎస్టీ రూపంలో ప్రజలను పిండేసి ఇప్పుడు వెన్న పూసినట్లుగా కేంద్రం వైఖరి ఉందన్నారు. తెచ్చిన జీఎస్టీలో 18, 24 శ్లాబుల్లో ప్రజలు అధికంగా వినియోగించే వస్తువులు చేర్చారని ఆరోపించారు. జీఎస్టీతో నిత్యావసర వస్తువుల ధరలు డబుల్ అయ్యాయని విమర్శించారు. జీఎస్టీ రొట్టెలు తినే పేదవాడి మీద ఎక్కువ జీఎస్టీ లగ్జరీ వస్తువుల మీద మాత్రం తక్కువ ఉండేదన్నారు. పెట్రోల్, డీజిల్ జీఎస్టీలో చేర్చాలని చాలా రాష్ట్రాలు విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు చేయలేదని విమర్శించారు. కేంద్రం చివరకు శవ పేటికలకు కూడా జీఎస్టీ వేశారని, శవాలను దహనం చేసే సమయంలో చెల్లించే సొమ్ముపై కూడా జీఎస్టీ వసూలు చేశారని ధ్వజమెత్తారు. జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చినా ఇంకా పాత ధరలకే విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, జీఎస్టీ మార్పుల ఫలాలు పేదోడికి ఏ మేరకు అందుతాయో చూడాలని
నష్టాన్ని ఎలా పూడ్చుతారో చెప్పండి?:
శవ పేటికలు, పసి పిల్లల తినుబండారాలపై కూడా జీఎస్టీ వేశారని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ ట్యాక్స్ తో ఏదైనా మంచిపని చేశారా? ఆర్థిక సంక్షోభం నుండి తప్పించుకోవడానికే మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. జీఎస్టీ మార్పులతో తెలంగాణకు రూ.7 వేల కోట్ల నష్టం వస్తోందని దీన్ని పూడ్చే బాధ్యత కేంద్రప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ ఎంపీలు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి తెలంగాణకి వస్తున్న నష్టాన్ని ఎలా పూడ్చుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి అండగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఒక చేతితో ఇచ్చి మరొక చేతితో తీసుకునట్లు ఉందని, జీఎస్టీ కౌన్సిల్ లో కేంద్ర ప్రభుత్వానిదే పెత్తనం ఉందని దీన్ని ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పాటు చేయాలన్నారు. జీఎస్టీ తగ్గించి కేంద్ర ప్రభుత్వం మీ చావు మీరు చావండి అన్న విధంగా వ్యవహరిస్తోందని, సంక్షేమం మొత్తం రాష్ట్రాల మీద రుద్దుతూ కేంద్రం మాత్రం సెస్‍ల పేరుతో దండుకుంటోందని ద్వజమెత్తారు. జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు 10 సంవత్సరాల పాటు రాష్ట్రాల నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది అని చెప్పారు. కానీ పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్న రూ.7 వేల కోట్లపై మాకు ఎంత ఇస్తారో ప్రామిస్ చేయాలన్నారు.






