Ponnam: బండి సంజయ్‍కి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం

by Prasad Jukanti |   (  Updated:2025-12-06 06:46:56  IST  )

కేంద్ర మంత్రి బండి సంజయ్ ను మంత్రి పొన్నం ఆహ్వానించారు.

Ponnam: బండి సంజయ్‍కి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్–2047 గ్లోబల్ సమిట్’కు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‍ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలో చైతన్యపురి మహాశక్తి ఆలయంలో బండిని కలిసిన పొన్నం అధికారికంగా ఆహ్వానం అందజేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‍కు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నం ప్రభాకర్ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతామని చెప్పారు. గడిచిన పదేళ్లలో తెలంగాణ ఆర్థికంగా వెనకబడిందని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలన్నారు.

Next Story