- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కులగణనలో దేశంలో తెలంగాణ రోల్ మోడల్ : పొన్నం ప్రభాకర్
కుల గణనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : కుల గణనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మూసాపేటలోని మెజెస్టిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన మున్నూరు కాపు, కాపుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. కోకాపేటలో మున్నూరు కాపు భవననిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ఆ అంశం కోర్టులో ఉన్నందున చట్టపరంగా ముందుకు వెళ్తామని తెలిపారు.
బీసీ రిజర్వేషన్లను బలహీనవర్గాలన్నీ ఒక్క తాటిపై నిలిచి, పోరాడి సాధించుకోవాలన్నారు. ఈ సమ్మేళనంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






