పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు

by Gantepaka Srikanth |

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్‌గా నియమించింది.

పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్‌గా నియమించింది. పొన్నం ప్రభాకర్‌తో పాటు కర్ణాటక హెల్త్ మినిస్టర్ దినేష్ గుండు రావును కూడా ప్రత్యేక అబ్జర్వర్‌గా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం. ఇది నాలుగు జిల్లాలను కలిగి ఉంది. పుదుచ్చేరి, కారైకల్, మాహె, యానాం. 30 శాసనసభ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి.

మరోవైపు.. పుదుచ్చేరి రాజకీయాల్లో ఇప్పుడు ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రధాన పార్టీల మధ్య ముక్కోణపు పోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేయబోతున్నాయి. తమిళనాడు తరహాలో ఇక్కడ కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని కాంగ్రెస్, డీఎంకే చూస్తున్నాయి.

Next Story