మిడ్ మానేరు స్పీడ్ బోట్‌లో ప్రయాణించిన మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

by Ajay Maddhiboyina |

మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండలం వరదవల్లి శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

మిడ్ మానేరు స్పీడ్ బోట్‌లో ప్రయాణించిన మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
X

దిశ‌, వెబ్ డెస్క్: మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండలం వరదవల్లి శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వెళ్లేందుకు వీరు మిడ్ మానేరులో స్పీడ్ బోట్ లో ప్రయాణం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నట్లు వెల్లడించారు.

కేవలం దత్తాత్రేయ జయంతి రోజు మాత్రమే కాకుండా శాశ్వతంగా బోటు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని నేతలు హామీ ఇచ్చారు. ప్రతిపాదనలు ఇరిగేషన్ శాఖ వద్ద పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు సంవత్సరాల ప్రజా పాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రజాహితం కోరేవారిని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి గ్రామాల్లోనూ జ‌రిగే విధంగా ప్ర‌జ‌లు నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు.

Next Story