Ponnam: ఇందిరమ్మను ఇంకొక్క మాటన్న ఊరుకోరు.. ‘బండి’పై మంత్రి పొన్నం ఫైర్

by Ramesh Goud |

దేశం కోసం ప్రాణాల్పర్పించిన త్యాగశీలి ఇందిరాగాంధీని ఇంక్కొక్క మాట అన్న ప్రజులు ఊరుకోరని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ స్పష్టం చేశారు.

Ponnam: ఇందిరమ్మను ఇంకొక్క మాటన్న ఊరుకోరు.. ‘బండి’పై మంత్రి పొన్నం ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశం కోసం ప్రాణాల్పర్పించిన త్యాగశీలి ఇందిరాగాంధీని ఇంక్కొక్క మాట అన్న ప్రజులు ఊరుకోరని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ స్పష్టం చేశారు. ఇందిగాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వాఖ్యలపై మంత్రి పొన్నం తీవ్రంగా స్పందించారు. ఈమేరకు గాంధీ భవన్​లో ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్​లో మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రమంత్రి బండి సంజయ్​కుమార్​కు వార్నింగ్​ ఇచ్చారు. గరీబి హటావో నినాదంతో.. అనాడే పేదల సంక్షేమం ఇండ్ల నిర్మాణం, భూమి పంపిణీ చేసిన ఉక్కు మహిళా ఇందిరమ్మ గురించి అవహేళనగా బండి సంజయ్​ మాట్లాడాన్ని మంత్రి తప్పుబట్టారు. బండి సంజయ్ ఇంట్లో నుంచి డబ్బులు ఏమీ ఇవ్వడం లేదన్నారు.

‘ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా?.. ఎలా ఇవ్వరో మేము చూస్తామని’ అని మంత్రి అన్నారు. ఇందిరాగాంధీని వాజ్ పాయ్ కాళీమాతతో కీర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పది నెలల కాలంలో జీఏస్టీ రూపంలో 37 వేల కోట్లపై చిలుకు రూపాయలు కేంద్రం ప్రభుత్వం వసూలు చేసింది అని పేర్కొన్నారు. మరి కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చినా నిధులు ఎంత? అని మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రశ్నించారు. దీన్ దయాల్ అంత్యోదయ , దీన్ దయాల్ గృహ జ్యోతి లాంటి పేర్లు పథకాలకు ఎందుకు పెట్టారని విమర్శించారు. వీల్లేమైనా దేశం కోసం ప్రాణత్యాగం చేశారా ? అని ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి కేంద్రంలో ఇద్దరు మంత్రులు ఉండి ఏం లాభం? కేంద్రం నుంచి అదననంగా ఒక్క రూపాయన్న తెచ్చారా? అని ప్రశ్నించారు. దేశంలో రాజ్యంగబద్ధంగా ఏర్పాటైన 29వ రాష్ట్రం తెలంగాణకు నిధులు ఇవ్వడంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. చరిత్ర కలిగిన ఇందిరాగాంధీని ఇంకొక్క మాట అన్న తెలంగాణ ప్రజలే కాదు.. యవత్​ దేశ పౌరులు ఊరుకోరని మంత్రి స్పష్టం చేశారు.

కనీస అవగాహన లేకుండా మాట్లాతున్నా నాయకులు, వారి పద్ధతి మార్చుకునేలా తగిన జ్ఞానం నేర్పించాలని బీజేపీకి సూచించారు. తెలంగాణ పథకాల అమలు విషయంలో బీఆర్​ఎస్​ రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ఈ విషయంలో మంత్రి పొన్నం కేటీఆర్ కు మంత్రి కౌంటర్ ఇచ్చారు. స్కీముల అములపై కేటీఆర్​నువ్వే డిసైడ్ కా? ఏ ఊరికి పోదమోనని? మంత్రి అన్నారు. ‘ఎక్కడికైనా నేను రెఢీ.. ఒక్క లబ్ధిదారుడికైనా అన్యాయం జరిగితే అప్పుడు అడుగు? అని’ మంత్రి మీడియా వేదిక సవాల్​ చేస్తున్నాని పేర్కొన్నారు. అసహకానికి కేటీఆర్ పరాకాష్ట అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలన ఆర్దిక విద్వంసం తర్వాత కూడా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ సంక్షేమం జీర్ణం కావడం లేదని, అందుకే ఈనో ప్యాకెట్లు పంపిస్తానని మంత్రి హెద్దెవ చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి , మీడియా కమిటీ చైర్మన్ సామ రాంమోహన్ రెడ్డి , టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్, దుర్గం భాస్కర్, నాయకులు సంగిశెట్టి జగదీశ్, నిజాముద్దీన్, రవి, లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story