- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponnam: తెలంగాణలో ఇన్వెస్ట్ చేయండి.. ఎన్ఆర్ఐలకు మంత్రి పొన్నం పిలుపు
అమెరికా హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో మంత్రి పొన్నం కీలక పిలుపునిచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలో దౌత్య సంబంధాల విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ధ్వజమెత్తారు. చదువులు, ఉద్యోగాల నిమిత్తం అమెరికా వెళ్తున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు ఆటంకగా మారాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం విదేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తోందని అయితే అమెరికాలో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ వారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఇవాళ హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు వారితో పాటు వివిధ రంగాల్లోని వారికి తెలంగాణ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తోందని చెప్పారు. మీకంతా సానుకూలంగా ఉండేలా ప్రభుత్వం పాలసీలను తయారు చేస్తోందని అందువల్ల విదేశాల్లో ఉన్నవారంతా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.






