- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌లో చేరాక పొంగులేటి మొదటి ప్రసంగం.. కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు
ఖమ్మం మాజీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం మాజీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. అనంతరం సభకు వచ్చిన అభిమానులను, పార్టీ శ్రేణులను ఉద్దేశించి పొంగులేటి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేయడం ఖాయమని అన్నారు. యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ భారీగా పెరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దింపి.. కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలనే తాను కాంగ్రెస్‌లో చేరానని వెల్లడించారు.
కేసీఆర్ అంతం ప్రారంభమైందని, అతి త్వరలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. కేసీఆర్ అవినీతిని వెలికి తీస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. నిరుద్యోగులు, రైతులు ఎవరు ఆనందంగా లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా వరంగల్ డిక్లరేషన్‌ను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సభ జరుగకుండా పొద్దటినుంచి అనేక ఇబ్బందులు పెట్టారని, అయినా భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. దేశంలోనూ అవినీతి ప్రభుత్వం కొనసాగుతోందని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం అందరం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Read More..
పొంగులేటికి కండువా కప్పి ఆహ్వానించిన రాహుల్ గాంధీ
నేను అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పేదలకు లక్షల ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది.. సీఎల్పీ నేత భట్టి






