Bhatti Vikramarka : పేదలకు లక్షల ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది.. సీఎల్పీ నేత భట్టి

by Javid Pasha |
Bhatti Vikramarka : పేదలకు లక్షల ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది.. సీఎల్పీ నేత భట్టి
X

దిశ, వెబ్ డెస్క్: పేద ప్రజలకు లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో నిర్వహిచిన కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. ఒక్క ఎకరం కూడా పంచలేదని మండిపడ్డారు. కానీ ఇందిరాగాంధీ హయాంలో దాదాపు 24 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టామని అన్నారు.

రాష్ట్ర ప్రజల బాధలను తెలుసుకోవడానికి తాను పీపుల్స్ మార్చ్ చేశానన్న భట్టి.. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగళాఖాతంలో విసిరేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.

Read More..

ఆరు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి



Next Story

Most Viewed