ఓటమిని ముందే ఎవరూ అంగీకరించరు,జగన్ కూడా అంతే..పీకే సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
ఓటమిని ముందే ఎవరూ అంగీకరించరు,జగన్ కూడా అంతే..పీకే సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక రాష్ట్రంలో గెలుపు ఓటముల పై చర్చలు జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదని ప్రధాన పార్టీలన్నీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనేది జూన్ 4వ తేదీన తేలిపోతుంది. కావున అప్పటి వరకు వేచి చూడాల్సిందే. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధికారంలో కొనసాగబోదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికార పార్టీకి ఘోరమైన పరాజయం ఎదురు అవుతుందని తేల్చి చెప్పారు. తాము కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ రాబోయే ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ముందే ఓటమిని ఏ రాజకీయ నాయకుడు కూడా అంగీకరించరని పీకే తెలిపారు. తాను పదేళ్లకు పైగానే ఎన్నికల క్షేత్రంలో పని చేస్తున్నానని చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజు నాలుగైదు రౌండ్లు పూర్తయిన తర్వాత వరకు కూడా రాజకీయ నాయకులు ఓటమిని అంగీకరించారని చెప్పారు. మరోవైపు, దేశవ్యాప్త ఎన్నికల పరిణామాలపై ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గవని అభిప్రాయపడ్డారు. దేశంలో బీజేపీ, మోడీలపై అసంతృప్తి ఉంది కానీ, ఆగ్రహం లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. కాబట్టి, బీజేపీకి 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ, లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.

Read More..

BREAKING: అడ్డంగా బుక్కైన కేఏ పాల్.. ఆ విషయంలో చీటింగ్ కేసు నమోదు



Next Story

Most Viewed