Tirumala Samacharam: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

by Kema Shiva Kumar |   (  Updated:2024-05-20 14:47:37  IST  )

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది.

Tirumala Samacharam: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. ఆదివారం, శ్రీవారిని దర్శనానికి ప్రజలు ఎక్కవ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 16 గంటల సమయం పడుతోంది. ఆదివారం వారం సెలవు దినం కావడంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. మరోవైపు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి భక్తుల శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు.

ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. సోమవారం కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వ దర్శనానికి కంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తుల వేచి చూస్తున్నారు. ఆదివారం స్వామి వారిని 86,721 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 39,559 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Read More...

తిరుమలలో రెండు చిరుతల కలకలం.. భయాందోళనలో భక్తులు

Next Story