Ponguleti: కిషన్ రెడ్డి మాటలు తప్ప చేసిందేమి లేదు: పొంగులేటి

by Prasad Jukanti |

మేడారం జాతర విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను మంత్రిపొంగులేటి ఖండించారు.

Ponguleti: కిషన్ రెడ్డి మాటలు తప్ప చేసిందేమి లేదు: పొంగులేటి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మేడారం (Medaram) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.3.26 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటన అబద్ధం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఖండించారు. కిషన్ రెడ్డి మాటలు చెప్పడం తప్ప చేసిందిందేమి లేదని విమర్శించారు. ఇవాళ మేడారంలో మరో మంత్రి సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడిన పొంగులేటి.. మేడజారం అభివృద్ధికి కేంద్రం నయా పైసా సాయం చేయలేదని చెప్పారు. మేడారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తోందన్నారు. మేడారం శ్రీ సమ్మక్క–సారక్క జాతరను ‘జాతీయ పండుగ’గా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

Next Story