Ponguleti: కేసీఆర్ మనుషులు నరరూప రాక్షసుల్లా ప్రవర్తించారు.. పొంగులేటి విమర్శలు

by Prasad Jukanti |

రైతుల ఇబ్బందులు తొలగించేందుకే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Ponguleti: కేసీఆర్ మనుషులు నరరూప రాక్షసుల్లా ప్రవర్తించారు.. పొంగులేటి విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలందరూ కష్టపడి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని తెచ్చుకున్న ఈ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో తీసుకువచ్చిన ధరణి ఇబ్బందులను తొలగించుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో భూభారతి-2025 చట్టంపై (Bhubharathi) అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన మంత్రి.. రైతుల ఇబ్బందులు తొలగించేందుకే భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చామన్నారు. 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వంలోని నలుగురు పెద్దలు నాలుగు గోడల మధ్య ధరణి చట్టం తీసుకువచ్చి ప్రజల మీద రుద్దారని ధ్వజమెత్తారు. చట్టమైతే చేశారు తప్ప మూడేళ్లు అయినా విధివిధానాలు రూపొందించలేదని, దొర నోటి మాటలే నాటి చట్టానికి విధివిధానాలుగా మారాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భూభారతి చట్టం తెచ్చిన 90 రోజుల్లో విధి విధానాలు ప్రజలకు అంకితం చేశామన్నారు.

భూభారతి చట్టమే శ్రీరామ రక్ష:

ధరణిలోని (Dharani) సమస్యలపై ప్రజలు ప్రజలు గగ్గోలు పెట్టినా నాటి దోరకు కనికరం కలగకపోగా ధరణి సంజీవని అంటూ గొప్పలు చెప్పారని విమర్శించారు. గత ప్రభుత్వం మాదిరిగా భూభారతి అర్థరాత్రి చేయలేలేదన్నారు. ఈ చట్టాన్ని చేసే ముందు అన్ని జిల్లా రైతుల కష్టాలేంటో ఓ కమిటీని నియమించి తెలుసుకున్నాం. చివరకు ప్రతిపక్షాల సూచనలు కూడా తీసుకున్నాం. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను పరిశీలించి వాటిలోని మంచి విషయాలను స్వీకరించి డ్రాప్ట్ ను ప్రజల ముందు ఉంచి ఆ తర్వాతే చట్టం చేశామన్నారు. అసెంబ్లీలో భూభారతి చట్టం ఆమోదించే సయమంలో కేసీఆర్ (KCR) మనుషులు నరరూప రాక్షసుల్లా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి సూచనలో అదరకుండా పేదవాడి కష్టాన్ని తీర్చే ఈ భూ భారతి చట్టాన్ని తీసుుకవచ్చామన్నారు. భవిష్యత్ లో పేదవాడి కష్టాన్ని తీర్చేందుకు ఈ భూభారతి చట్టమే శ్రీరామ రక్ష అన్నారు.

అవసరమైతే విధివిధానాల్లో మార్పులు

జూన్ 2వ తేదీ నాటికి పైలట్ ప్రాజెక్టు కింద ఉన్న నాలుగు మండలాల్లో వీలైనన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మే 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 28 జిల్లాల్లోని ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుంటామని ఆ జిల్లాల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరం అయితే విధివిధానాల్లో మార్పులు తెస్తామన్నారు. ప్రజలకు ఉపయోగకరమైన చట్టం తేవాలనే తమ ఏకైక లక్ష్యం తప్ప ప్రజలపై చట్టాలను బలవంతంగా రుద్దబోమన్నారు. 9.26 లక్షల మంది సాధాబైనామా కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో సహేతుకమైన దరఖాస్తులను పరిశీలించి వాటిని పరిష్కరిస్తామన్నారు. తప్పులు చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని ఈ నెలాఖరు నాటికి ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయని. రాష్ట్ర యువత కోసం 6 వేల కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చామన్నారు.

Next Story