- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేడు పొంగులేటి కీలక ప్రకటన.. మాజీ MP రాజకీయ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..?
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలో పొంగులేటి ఆదివారం ఖమ్మంలో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌తో విభేదాల కంటే ముందు నుంచి పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుండగా.. ఇది చివరి ఆత్మీయ సమ్మేళనంగా తెలుస్తోంది. అందువల్ల ఇవాళ్టి మీటింగ్‌లో తన రాజకీయ భవిష్యత్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి కేసీఆర్ వ్యతిరేకులను ఏకం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే జూపల్లి వంటి కీలక నేతలతో టచ్‌లో ఉంటూనే క్షేత్రస్థాయిలో బలమైన నేతలను తన వైపు ఉండేలా పావులు కదుపుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన కొత్త పార్టీని పెడతారంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుండగా.. కాంగ్రెస్, బీజేపీలు మాత్రం పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ్టి సమావేశంలో ఏదైనా కీలక ప్రకటన ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది.
Also Read...
బీసీలకు రూ.లక్ష స్కీమ్ వెనుక భారీ ప్లాన్.. దానికి భయపడే KCR హుటాహుటి ప్రకటన..?