- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందిరమ్మ ఇల్లు.. వారందరికీ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ బిగ్ షాక్!
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు. అనర్హులు అని తేలితే ఇం

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు. అనర్హులు అని తేలితే ఇందిరమ్మ ఇల్లు రద్దు చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో... ఇందిరమ్మ ఇళ్ల (indiramma houses) పంపిణీ, కొత్తగా ఇండ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే.. ఒక్కొక్క హామీని అమలుపరచుకుంటూ ముందుకు వెళ్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
అయితే ఇందులో భాగంగానే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ఒక్కో ఇందిరమ్మ ఇంటికి ఉచితంగా 40 మెట్రిక్ టన్నుల ఇసుక అందేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
స్టీలు, ఇసుక అలాగే సిమెంట్ కోసం మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా సూచనలు చేశారు. లబ్ధిదారుల ఎంపిక, ఇండ్ల మంజూరు, నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. అదే సమయంలో ఎవరైనా అనర్హులని తేలితే ఇల్లు నిర్మాణంలో ఉన్నా కూడా రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.






