కేసీఆర్ సంచలన నిర్ణయం.. పార్టీ నుంచి పొంగులేటీ శ్రీనివాసరెడ్డి, జూపల్లీ కృష్ణారావు సస్పెండ్..

by Disha Web Desk 12 |
కేసీఆర్ సంచలన నిర్ణయం.. పార్టీ నుంచి పొంగులేటీ శ్రీనివాసరెడ్డి, జూపల్లీ కృష్ణారావు సస్పెండ్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను భారత్ రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నది. గత కొన్ని రోజులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ నాయకత్వంపై అసంతృప్తితో వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం పార్టీ అగ్ర నాయకత్వం తనను పట్టించుకోలేదని, మూడేళ్లుగా పార్టీ సభ్యత్వాన్ని కూడా రెన్యూవల్ చేయలేదని ఆరోపించారు.

వీరిద్దరూ జాయింట్‌గా కొత్తగూడెంలో ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్‌పైనా, ఆయన కుటుంబంపైనా తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. ఇది జరిగిన గంటల వ్యవధిలో పార్టీ కార్యాలయం నుంచి వీరిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన వెలువడడం గమనార్హం. ఈ సస్పెన్షన్ పైన ఇద్దరూ విడివిడిగా వారివారి జిల్లాల్లో మీడియాతో వివరంగా మాట్లాడడానికి కసరత్తు మొదలుపెట్టారు. మరికొన్ని గంటల్లో పార్టీ తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయంపై మీడియాతో మాట్లాడనున్నారు.

Also Read: సస్పెన్షన్ వేటుపై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు..


Next Story

Most Viewed