"రప్పా రప్పా" ఫ్లెక్సీలపై పొంగులేటి సీరియస్..!

by velandi.Saikiran |

రెండు తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ సినిమా పుష్ప డైలాగ్ "రప్పా రప్పా" హాట్ టాపిక్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని

రప్పా రప్పా ఫ్లెక్సీలపై పొంగులేటి సీరియస్..!
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ సినిమా పుష్ప డైలాగ్ "రప్పా రప్పా" హాట్ టాపిక్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నాయకులు ఈ డైలాగులు వాడుకొని... ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి వరకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇదే డైలాగ్.. వాడుకొని కూటమి ప్రభుత్వంపై రెచ్చిపోయారు. ఇక ఇప్పుడు గులాబీ పార్టీ నేతలు కూడా ఇదే డైలాగ్ వాడుకొని... కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు.

హరీష్ రావు (Harish Rao), గులాబీ పార్టీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి (Jagadishwar Reddy) అభిమానులు కూడా రప్పా రప్పా ( Rappa Rappa) అనే డైలాగులు ఫ్లెక్సీ ల పై ఏర్పాటుచేసి... 3.0 లోడింగ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ డైలాగ్ వార్ పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు... ఇదంతా దేనికోసం అని గులాబీ పార్టీ నేతలను నిలదీశారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

శాంతి భద్రతలతో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని... ఏం చేయాలనుకుంటున్నారు..? సినిమా డైలాగులు వాడుకొని రెచ్చిపోతున్నారు...? అని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వానికి శాంతి భద్రతల విషయంలో చిత్తశుద్ధి ఉందని.. గుర్తు చేశారు. సినిమా డైలాగులు చెప్పుకొని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే.. ప్రజలే వాళ్లకు బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు.

Next Story