- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponguleti: హిమాచల్ ప్రదేశ్ హౌసింగ్ మినిస్టర్ తో మంత్రి పొంగులేటి భేటీ
హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) గృహనిర్మాణ శాఖమంత్రి రాజేష్ ధర్మాని(Housing Minister Rajesh Dharmani)తో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) భేటీ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) గృహనిర్మాణ శాఖమంత్రి రాజేష్ ధర్మాని(Housing Minister Rajesh Dharmani)తో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో(Telangana Secretariet) జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ పథకాల గురించి మంత్రి పొంగులేటి, హిమాచల్ ప్రదేశ్ హౌసింగ్ హౌసింగ్ మినిస్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన.. ఔటర్ రింగ్ రోడ్డు(ORR), రీజనల్ రింగ్ రోడ్డు(RRR) మధ్యలో మధ్య తరగతి ప్రజానీకం కోసం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు(kukatpally Housing Board) తరహాలో ఇండ్ల నిర్మాణాల కోసం స్థలం కేటాయించనున్నామని తెలిపారు.
కనీసం వంద ఎకరాలలో ఈ టౌన్ షిప్(Town Ship) లను నిర్మించి మధ్య తరగతి ప్రజానీకానికి అందుబాటులోకి తేవాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల పధకం ద్వారా నిరుపేదలకు శాశ్వత గృహాలు నిర్మించాలన్న సంకల్పంతో వచ్చే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. హైదరబాద్ నగరం వేగంగా విశ్వ నగరంగా అభివృద్ధి చేయడానికి హైదరబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు సిటీలు ఉండగా ఫోర్త్ సిటీ(Fourth City)గా 15 వేల ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం, వివిధ అంశాల పై మంత్రి చర్చించారు.






