- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డితో పొంగులేటి భేటీ!
బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం క్లైమాక్స్ దశకు చేరుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం క్లైమాక్స్ దశకు చేరుకుంది. తాజాగా ఆయన టీపీసీసీ రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. బుధవారం పొంగులేటి రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశం కాబోతున్నారని, పార్టీలో చేరికతో పాటు ఆయనతో పాటు ఎవరెవరు చేరుతున్నారు. తన అనుచరులకు టికెట్లు అంటి అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా పార్టీలో చేరాలా లేక ఢిల్లీలో వెళ్లి నేరుగా అధిష్టానం పెద్దల వద్దే కండువా కప్పుకోవాలా అనేదానిపై ఇరువురు చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోకి పొంగులేటి చేరడం దాదాపు ఖాయం కావడంతో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ స్వదేశానికి తిరిగి రాగానే పొంగులేటి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఆలోపే రేవంత్ రెడ్డితో పొంగులేటి సమావేశం కాబోతుంటడం ఆసక్తిగా మారింది.






