- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponguleti: ఇంత హంగామా అవసరమా? కేటీఆర్ కు మంత్రి పొంగులేటి కౌంటర్
కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం విచారణ సందర్భంగా కేసీఆర్ హంగామా చేశారని ఇప్పుడు ఏసీబీ విచారణకు వెళ్తూ కేటీఆర్ (KTR) కూడా ఏదో జరగబోతున్నట్టుగా హల్ చల్ చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) విమర్శించారు. ఏసీబీ విచారణలో విచారణలో ప్రభుత్వ ప్రమేయం ఉండదన్నారు. కేటీఆర్ విచారణకు అంత హంగామా అవసరమా అని ప్రశ్నించారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన మంత్రి.. ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు ఉద్దేశం లేదన్నారు. విచారణ తర్వాత ఏసీబీ ఇచ్చే నివేదికల ప్రకారమే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో చర్యలు ఉంటాయన్నారు.
బీసీ రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నాం..
త్వరలోనే పంచాయతీ ఎన్నికలు (Local Body Elections) జరగబోతున్నాయని బీసీ రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నామన్నారు. పెంచిన రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ దే హవా అని ధీమా వ్యక్తం చేశారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు రాలేదని ఎవరూ బాధపడొద్దన్నారు. విడతల వారీగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పారు. ఏడాదిన్నర కాలంలోనే ఇచ్చిన హామీలు ఎన్నో అమలు చేశాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా మిగిలిన హామీలనూ అమలు చేస్తామన్నారు.






