అటు కేటీఆర్ ఇటు పొంగులేటి.. మహబూబాబాద్ జిల్లాలో టెన్షన్ టెన్షన్

by Ajay Maddhiboyina |

సర్పంచ్ ఎన్నికలు ముగిసిన అనంతరం తమ పార్టీల మద్దతుతో గెలిచిన అభ్యర్థులను నాయకులు సన్మానిస్తున్నారు. స్థానిక బడా నేతలతో పాటు మంత్రులు, మాజీ మంత్రులు

అటు కేటీఆర్ ఇటు పొంగులేటి.. మహబూబాబాద్ జిల్లాలో టెన్షన్ టెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: సర్పంచ్ ఎన్నికలు ముగిసిన అనంతరం తమ పార్టీల మద్దతుతో గెలిచిన అభ్యర్థులను నాయకులు సన్మానిస్తున్నారు. స్థానిక బడా నేతలతో పాటు మంత్రులు, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తన సొంత జిల్లాలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు సన్మానం చేసి అభినందించారు. కాగా నేడు మహబూబ్ నగర్ జిల్లాలో ఒకే రోజు అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ సర్పంచ్ ల ఆత్మీయ అభినందన సభలను ఏర్పాటు చేస్తున్నాయి.

కాగా బీఆర్ఎస్ సర్పంచుల ఆత్మీయ అభినందన సభకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. మరోవైపు ఆర్తి గార్డెన్స్ లో జరగబోయే కాంగ్రెస్ సర్పంచుల ఆత్మీయ అభినందన సభకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నారు. ఒకేరోజు ఇద్దరు రాజకీయ నాయకులు మహబూబ్ నగర్ వస్తుండటంతో జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. కార్యక్రమాలకు వెళ్లేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సిద్ధమౌతున్నారు. రెండు పార్టీల సభలు ఉండటంతో పోలీసులు సైతం అలర్ట్ గా ఉన్నారు.

Next Story