TG POLYCET: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పాలిసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-21 04:33:59  IST  )

పాలిసెట్ (TG POLYCET) దరఖాస్తు గడువును రేపటి వరకు పొడిగించిన రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది.

TG POLYCET: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పాలిసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘పాలిసెట్’ (TG POLYCET) దరఖాస్తు గడువును రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి పొడిగించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశమని అధికారులు వెల్లడించారు. ఎలాంటి లేట్ ఫీజు లేకుండానే రేపటి వరకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఇక ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మే 13న పాలిసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. అర్హులైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.polycet.sbtet.telangana.gov.in/#!/index ద్వారా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. సాంకేతిక ఇబ్బందులు, ఇతర కారణాల వల్ల దరఖాస్తు చేయడంలో ఆలస్యమైన విద్యార్థుల ప్రయోజనం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. పాలిటెక్నిక్ విద్యలో చేరాలనుకునే విద్యార్థులు ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Next Story