పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

by Muthe.Rajitha |

తెలంగాణ పాలిసెట్ 2025 ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదలైంది.

పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పాలిసెట్ 2025 ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ షెడ్యూల్ ప్రకారం ప్రవేశాల ప్రక్రియ రెండు విడతల్లో జరగనుంది. ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్‌లైన్ సెంటర్, తేదీ, సమయం ఎంపికకు స్లాట్ బుకింగ్ కొరకు జూన్ 24 నుండి జూన్ 28 వరకు అవకాశం కల్పించారు. జూన్ 26 నుంచి 29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, జూన్ 26 నుంచి జూలై 1 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. జూలై 4 లోపు సీట్ల తాత్కాలిక కేటాయింపు ఉంటుంది. జూలై 4 నుంచి 6 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ కు అవకాశం కల్పించారు. అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకొని, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు త్వరగా హాజరైతే ఆప్షన్లు వినియోగించుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుందని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, వెంటనే స్లాట్ బుక్ చేసుకోవాలని అభ్యర్థులకు, తల్లిదండ్రులకు సాంకేతిక విద్యాశాఖ సూచించింది.

వివరణాత్మక నోటిఫికేషన్, హెల్ప్‌లైన్ సెంటర్ల జాబితా, కోర్సుల జాబితా https://tgpolycet.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నల్ స్లైడింగ్ కన్వీనర్ ద్వారా చేపట్టాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. జూలై 21 నుంచి 22 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ కు అవకాశం కల్పించారు. జూలై 24 లోపు అన్ని సీట్లను కేటాయించి జూలై 23 న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. జూలై 30 న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కానుంది.

చివరి దశ షెడ్యూల్:

మొదటి దశలో హాజరు కాని అభ్యర్థులకు స్లాట్ బుకింగ్: జూలై 9 నుంచి 10 వరకు

చివరి దశలో స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్: జూలై 11న

ఆప్షన్ల ఎంపిక: జూలై 11 నుంచి 12 వరకు.

ఆప్షన్ల ఫ్రీజింగ్: జూలై 12 న

సీట్ల తాత్కాలిక కేటాయింపు: జూలై 15 లోపు.

ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ : జూలై 15 నుండి 16 వరకు.

కేటాయించిన కాలేజీలో రిపోర్టింగ్: జూలై 15 నుండి 17 వరకు.

కాలేజీల ద్వారా అభ్యర్థుల జాయినింగ్ వివరాలను అప్‌డేట్ చేయడానికి చివరి తేదీ: జూలై 18 న

విద్యా సంవత్సరం ప్రారంభం: జూలై 15 న

ఓరియంటేషన్: జూలై 15 నుండి 17 వరకు.

తరగతులు ప్రారంభం: జూలై 18 న.

Next Story